దార్శనికత

భారతదేశానికో ప్రత్యేకమైన పరిస్థితి వుంది. జనం పేదవాళ్ళు. నిరాడంబరులు, కష్టజీవులు. వీళ్లకోసం, వీళ్ళ బతుకుల్ని బాగు చేయడం కోసం ఇపుడు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం వుంది. అంటే మూస పద్ధతుల్ని మానేయాలి. సృజనాత్మకమైన ఆలోచన, టెక్నాలజీని పిలకపట్టుకుని మన హైస్కూళ్ల ముందుకి ఈడ్చుకొచ్చే సాహసం లాంటివి అనేకం చేయాలి. పాత పద్ధతులూ, చాదస్తాల్ని వదిలించుకోవాలి. కొత్తతరం ఆశల ముందు తలవంచాలి.

2009 ఎన్నికల సమయంలో బ్రెజిల్ తరహాలో ‘నగదు బదిలీ’ పతకం ప్రవేశ పెట్టాలన్న తెలుగుదేశం ప్రతిపాదన నిజానికి లోకేష్‌దే. దీన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. హిపోక్రసీ ఏమిటంటే- 2013 జనవరిలో యు.పి.ఎ. ప్రభుత్వం దీన్నే తు.చ. తప్పకుండా పాటించింది.

అలాగే, అవినీతి, క్విడ్‌ప్రోకో లాంటి ప్రైవేటు, ప్రభుత్వ చీకటి యవ్వారాల గురించి అవి ప్రజలకు చేయబోయే హాని గురించీ విడమర్చి చెప్పడంలో, 2014 ఎన్నికలకు జనాన్ని సన్నద్ధం చేయడంలో లోకేష్ పాత్ర చెప్పకోదగ్గది.

సోషల్ మీడియాగా పేరుగాంచిన ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల నుంచి నిపుణుల, విశ్లేషకుల ద్వారా సేకరించిన కొన్ని టన్నుల సమాచారాన్ని కుదించిచ, ఒక పద్ధతిలో పేర్చి 2014 ఎన్నికల యుద్ధానికి కొత్త సమాచార ప్రచార ఆయుధాల్ని తయారు చేసింది లోకేషే. పార్టీ అంటే చంద్రబాబు ఒక్కరే కాదుగా, అభ్యర్థులు, జిల్లా నాయకులు, సలహాదార్లు, తాబేదార్లు, ఓటర్లు…ఇదొక పెద్ద యాతన. నియోజక వర్గానికి తగిన అభ్యర్థిని ఎంపిక చేయడం నుంచి పార్టీ విధాన రూపకల్పన దాకా ప్రతి మలుపులోనూ లోకేష్ ముద్ర బలంగా వుంది.

Vision

రాజకీయ వారసత్వం

మనవి చాలా సింపుల్ రాజకీయాలు. ప్రాంతీయ విభేదాలు, కులాల కుమ్ములాటలు, హెచ్చుతగ్గుల తకరారు….. ఇలాంటి గొడవలు పెట్టి, రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునే దగుల్బాజీ పితలాటకం! ‘తగువులు పెట్టడం మన నైజం కాదు. కులమా? మతమా? ప్రాంతమా? గ్రామమా? ఇలాంటి సవాలక్ష సంకుచిత లక్షణాల్ని పక్కన పెడదాం. అందర్నీ కలుపుకొని పోదాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. దళితవాడలూ విరబూయాలి. బి.సీ.లు చదువుల్తో ముందుకు రావాలి. మహిళలు వేదన నుంచి, దాడుల నుంచి తలెత్తుకుని తిరిగే మంచి కాలం ఒకటి మనకి కావాలి’- ఇదీ లోకేష్ మాట. సకల జనుల సంక్షేమం అనే నినాదం లోకేష్‌ బాట. నిజానికి అది నందమూరి తారక రామరావు ఆకాంక్ష. చంద్రబాబు నాయుడి ఆశయం. వాళ్ల బిడ్డ లోకేష్‌కి అదే ఆలోచన వుండడం ఈ రాష్ర్టం చేసుకున్న అదృష్టం.

లోకేష్ ఆలోచన ఏమిటంటే ఈ సమాజాభివృద్ధికి పంచామృతం కావాలి. అవి: విజ్ఞానం, నీళ్ళు, ఇంధనం, భద్రత, మానవ వనరుల సద్వినియోగం! ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడే ఈ సమాజాన్ని కొత్త వెలుతురు రోజుల్లోకి నడిపించాలంటే ఇవన్నీ అత్యవసరం.

Political Legacy

అభివృద్ధి నమూనా:

అన్ని రంగాల్లో అభివృద్ధి సక్రమంగా, సజావుగా జరగాలంటే ప్రభుత్వమూ, ప్రైవేటు రంగమూ కలిసికట్టుగా (దీన్నే పి.పి.పి. అంటాం) పని చేయాలన్నది లోకేష్ ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలకూ మంచినీళ్ళు అందజేయాలన్నది లోకేష్ మనసుకి నచ్చిన పని. ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరుతో పిపిపి పద్ధతిలో దీని అమలుకు కృషి జరుగుతోంది. ఎన్నో పేరున్న సంస్థలు దీనికి సహకరిస్తున్నాయి. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ కోసమూ యిలాంటి ఆలోచనే చేస్తున్నారు లోకేష్.

పట్టణీకరణ అనేది కొంపముంచేదిగా కాకుండా, ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగు పరిచేదిగా మలచాలనే లోకేష్ పట్టుదలతో వున్నారు.

Development-Model

నా గుండె, నా జెండా, నా పార్టీ:

ఆంద్ర తెలంగాణాల్లో తెదెపా కార్యకర్తల సంక్షేమ విభాగం. లోకేష్ ఇపుడు సమన్వయకర్తగా వున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధిలో భాగమై, అందుకు పాటిపడి ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కార్యకర్తల సంరక్షణే ధ్యేయంగా ఈ విభాగం ఏర్పాటయ్యింది. ఇప్పటి కార్యకర్తలకు తోడుగా మరో ఏడాదిలో 6 లక్షల 60 వేల మంది పార్టీ సైనికులు సిద్ధంగా వుంటారు. వాళ్లందరికి ఉద్యోగాలు, బీమా సౌకర్యాలు అందబోతున్నాయి. ఈ సైన్యమే పార్టీకి కళ్లుగా, చెవులుగా పని చేస్తుంది_ వీళ్ల జీవితాలకు భీమా, ఇతర భద్రతల్ని పార్టీ కలగజేస్తుంది. శక్తిమంతమైన ఈ ప్రజాయుధం లోకేష్ చేతుల్లోనే వుంటుంది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకి నిరంతరం అందుబాటులోనే ఆయన ఉంటున్నారు.

Organization